ysrcp : ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం. దీన్నే చాలా మంది రాజకీయం అనుకుంటారు. వాస్తవానికి ఇది కాదు. రాజకీయం అంటే తనను తాను కాపాడుకుంటూ, ప్రత్యర్థుణ్ని ఓడించాలి. రాజకీయ పదవిని కాపాడుకోవడం నాయకుడి చేతిలోనే ఉంటుంది. ప్రత్యర్థులను ఓడించడం మాత్రం ప్రజలతో చేయించాలి. ఈ ఫార్ములా తెలియక నాయకులు బొక్కబోర్లా పడిపోయి లేవడంలేదు. ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి రాజకీయ ఎత్తులు వేయడంలో చాణక్యుడు అని చెప్పవచ్చు. చంద్రబాబు చిన్న వయసులో ఖద్దరు చొక్క వేసినా ఇప్పటికి కూడా తన ప్రసంగాల్లో ఎం తమ్ముళ్లూ అంటూ యువతను సంబోధిస్తూ ఆకట్టుకుంటారు.
కానీ జగన్ మాత్రం రాజకీయం అంటే నేను. నేను చెప్పిందే వేదం అనే భావనలో ఉన్నట్టు కనిపిస్తోంది. తాను కూచున్న కొమ్మను తానే నరికేసుకుంటాడు అనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏ కొంచెం కూడా ఓపిక లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పడిపోతున్నారు. లేస్తున్నారు. కానీ పడిపోయినప్పుడు తగిలిన గాయాలు మానకుండా శరీరానికి ఎంత నష్టం చేస్తున్నాయో గమనించడం లేదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం ఏపీ లో చాలా విచిత్రంగా కనబడుతోంది. ఆయన ఆలోచన విధానం పసిగట్టిన వారికి మాత్రం చాల ఆశ్చర్యం వేస్తుంది. అన్ని ఆలోచించే మాట్లాడుతున్నారా, లేదంటే ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా , ఇంకా చెప్పాలంటే అన్ని నాకే తెలుసు అనే మాట్లాడుతున్నారా అనేది ఎదుటివాళ్ళకు అర్థం కాదు. 175 స్థానాల్లో గెలుస్తాం అంటూ ప్రగల్బాలు పలికారు. బొక్కబోర్లా పడ్డారు. అయినా అయనలో మార్పు కలబడుత లేదు. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో చంద్రబాబు వేసిన గాలానికి పక్కా దొరికిపోయారు జగన్ మోహన్ రెడ్డి.
నెయ్యి కల్తీ కావడానికి , సీఎం కు ఏం సంబంధం ఉంటుంది అని ఎదురుదాడి చేసి తప్పుకోవాలి. కానీ నేనే అంటూ పోటీపడి ముందుకు వచ్చారు. అప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అంటుకున్న పంది నెయ్యి దేనితో కడిగితే పోతుందో తెలియక కొట్టుమిట్టాడుతోండు జగన్ మోహన్ రెడ్డి. అయినా తప్పించుకోడానికి తిరుమల వెళుతున్న, దేవుణ్ణి దర్శనం చేసుకుంటా అంటూ నీతి వాక్యాలు పలికారు. పదే, పదే తన ఇంటి మీడియా ద్వారా చెప్పి తప్పించుకోవాలని అనుకున్నారు. ఇది రాజకీయ ఆరోపణ కాదని కూడా గ్రహించలేక పోయారు. నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలు దొరికిపోయాయి. కేంద్ర ఆరోగ్యశాఖ కల్తీ అని తేల్చేసింది. కేసులు నమోదయినాయి. కల్తీ అని తెలిసి నెయ్యి తిప్పిపంపామని చెబుతున్నారు.
ఎన్నో మాయమాటలు చెప్పి తప్పించుకోవాలని చూసినా జగన్, అయన అనుచరులు నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయారు. సీఎం హోదా ఇంకా మరచిపోనట్టు ఉంది జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు సీఎం కాదు కదా ఆయన. ముందుగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చిన తరువాతనే దర్శన భాగ్యం కలుగుతుంది. ఇవ్వడం ఇష్టం లేకనే తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల వెళ్ళాలి అని సలహా ఇచ్చి పార్టీ నాయకులు ఆయన్ను బోల్తా కొట్టించడం ఇక్కడ మరో రాజకీయ విశేషం.