Balka Suman : తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. అంతే కాదు పార్టీ అధినేత కేసీఆర్ కు నమ్మిన బంటు కూడా. ఇది జగమెరిగిన సత్యం.
అందుకే బాల్క సుమన్ కు కొన్ని భాద్యతలు అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్రలో పార్టీ సభలకు సంబంధించిన పనులన్నీ కూడా బాల్క సుమన్ కనుసన్నల్లోనే పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు కూడా సుమన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గా కొనసాగారు.
చెన్నూర్ నుంచి మొదటి సారి పోటీ చేసిన సుమన్ విజయం సాధించాడు. రెండోసారి కూడా అధినేత కేసీఆర్ సుమన్ కె పార్టీ టికెట్ కేటాయించారు. దురదృష్టవశాత్తు ఓటమిచెందాడు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి హోదాలో ఓటమి చెందడంతో సుమన్ జిల్లాకు కొంతమేరకు దూరమయ్యాడు
దూకుడు స్వభావం ఉన్న సుమన్ తీరు కొందరు సింగరేణి, ప్రభుత్వ అధికారులకు జిల్లాలో రుచించలేదు. పార్టీకి చెందిన పలువురు నాయకులకు కూడా ఆయన నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడు కావడంతో సుమన్ ను చెన్నయ్ పంపారు కేసీఆర్. ఈ విషయం పార్టీలో చాల మంది నాయకులకు కూడా తెలియదు. బాల్క సుమన్ ను ఎందుకు పంపాడంటే ???
తమిళనాడు లో డీఎంకే పార్టీ నిబంధనలు ఏమిటి. పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. డీఎంకే నిబంధనలను తెలుసుకొని రావాల్సిందిగా అధినేత కేసీఆర్ బాల్క సుమన్ ను పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నయ్ లో డీఎంకే అధికార పార్టీ నాయకులతో కలిసి పార్టీ అభివృద్ధి గురించి చర్చలు జరుపుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.