Gupta Navaratri : విజయ దశిమిని పురస్కరించుకొని దేవి నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు దేవి నవరాత్రులను భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అదేవిదంగా వినాయక చవితిని పురస్క రించుకొని నవరాత్రుల్లో గణేష్ ను పూజిస్తారు. భక్తులకు చాలా వరకు ఈ రెండు నవరాత్రుల గురించి తెలుసు. కానీ గుప్త నవరాత్రుల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఇంతకు ఆ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి. ఆ నవరాత్రుల్లో ఎవరిని పూజిస్తారు. నవరాత్రుల్లో ఎలాంటి పూజ చేయాలి అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం…..
దుర్గాదేవిని ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రుల పేరిట కొలుస్తారు. ఈ నాలుగింటిలో గుప్త నవరాత్రులు ఒకటి కావడం విశేషం. ఇది భక్తులకు విశేషమైనది. ఆషాడం మాసంలో నిర్వహించే దుర్గాదేవి వేడుకలనే గుప్త నవరాత్రులు అని అంటారు. దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు పూజించడం వలన ఇంటిలో శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాదు తంత్ర విద్యకు కూడా ఈ నవరాత్రులు ప్రధానమైనవిగా చెప్పుకుంటారు. ఈ ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులు ఈ ఏడాది జూలై ఆరో తేదీన మొదలు కానున్నాయి.
గుప్త నవరాత్రులను పురస్కరించుకొని మొదటిరోజు కొన్ని అక్షంతలు తీసుకొని, వాటికి తొమ్మిది లేదా 11 గవ్వలను కలపాలి. వాటిని కొత్త ఎర్రటి గుడ్డలో కట్టిపెట్టి డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టాలి. ఇంటిలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలి. ఉపవాస దీక్ష చేపట్టి నవరాత్రుల్లో చివరి రోజున ఆ గవ్వలను ఇంటి ఆవరణలోని నేలలో పాతి పెట్టండి. దీన్ని పాటించడం వలన మీ ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతాయి.ఈ గుప్త నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి పాదాల వద్ద తామర పూలను సమర్పించాలి. దుర్గాదేవి కి సంబందించిన మంత్రాలను జపించండి. దింతో అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
ఈ ఏడాదిలో ఆషాడ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు జూలై ఆరో తేదీన ప్రారంభమై అదే నెల 15 తేదీన ముగియనున్నాయి. అదేవిదంగా జూలై ఆరో తేదీన ఉదయం 5.11 గంటల నుంచి సాయంత్రం 7.26 గంటల మధ్యలో గుప్త నవరాత్రి కలశ స్థాపన చేయడం వలన కుటుంబానికి అంతా కూడా దేవి అనుగ్రహం ఉంటుంది.