Ekadashi : ఏకాదశి తిథికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఏకాదశి మహావిష్ణు మూర్తికి అంకితం చేయబడింది. ఆషాడ మాసంలో శుక్ల పక్షములో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు.ఈ తొలి ఏకాదశిని ప్రతి హిందూ కుటుంబం పండుగ చేసుకుంటారు. ఈ పండుగ తోనే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది తొలిఏకాదశి ఎప్పుడు వస్తుంది. ముహూర్తం గురించి వేద పండితులు ఈ విదంగా చెబుతన్నారు.
ప్రతి ఏడాది ఆషాడ మాసం శుక్ల పక్షము ఏకాదశి తిథిని తొలిఏకాదశి పండుగను ఉపవాస దీక్షలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం పండుగ తిథి తేదీ : 06-06-2025 న వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం తేదీ : 05-06-2025న సాయంత్రం ఆరు గంటల యాబై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది. ఉపవాసం ఉదయం తిథి రోజు పాటించాలి.
ఏకాదశి పండుగను పురస్కరించుకొని ఉపవాస దీక్షలో ఉన్న వారికి ఆ ఏడాదంతా కుటుంబానికి శుభం కలుగుతుందని వేదంలో చెప్పబడింది. ఉపవాసంతో విష్ణు మూర్తికి మొక్కుకొంటె కోరిన కోరికలు కూడా తీరుతాయి. ఉపవాస దీక్ష పాటించేవారు తేదీ : 07-06-2025న ద్వాదశి తిథి న విరమించాలి.