BJP Selfy : తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా అక్కడక్కడ రెపరెపలాడింది. అదే ఊపుతో 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళింది కాషాయం పార్టీ. ఊహించని విదంగా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాబోయే తరానికి సవాల్ విసిరింది. గులాబీ పార్టీని చిత్తు చేసింది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి కూడా కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. పుంజుకున్న బలంతో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తాను మరోసారి చూపించడానికి బీజేపీ సిద్ధమవుతోంది. పార్టీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే, ఎంపీ లుగా గెలిచిన వారి కోసం కష్టపడిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. కానీ ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.
తెలంగాణాలో బీజేపీ కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. తాజాగా గెలిచిన వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులుగ భాద్యతలు చేపట్టారు.విజయం సాధించిన వారిని అభినందించడానికి వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఒకరి వద్దకు వెళితే మరొకరికి కోపం. పది మందితో కలిసి వెళితే చాడీలు మొదలవుతాయి. ఆ చాడీలను తట్టుకోవడం ఎవరితరం కూడా కాదు. గ్రూప్ గా వెళ్లి సెల్ఫీ దిగితే అది మరో నాయకుడికి వెళుతుంది. అక్కడికి వెళ్లడం వీలు కానీ నేపథ్యంలో అక్కడ చెవులు కొరకడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ భయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామని ఆశ పడుతున్న కాషాయం శ్రేణుల్లో మొదలైనది.
అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కేంద్ర మంత్రుల వద్దకు ఒంటరిగా వెళుతున్నారు. వాళ్ళ మనసులో ఉన్న కోరికను తీర్చమని వేడుకుంటున్నారు. అక్కడే ఒక సెల్ఫీ తీసుకుంటున్నారు. నాయకుడికి పూల బోకె ఇచ్చి, శాలువా కప్పి స్వీట్ తినిపించి , మరో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇలా ఖుషి, కుషీగా గడిపి వస్తున్నారు. ఇలా స్థానిక సంస్థల్లో పోటీచేయాలనే ఉబలాటం ఉన్న శ్రేణులు సీక్రెట్ సెల్ఫీలతో సంబరపడిపోతున్నారు.