Salman khan : ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన ఒకరిని ముంబై సౌత్ సైబర్ పోలీస్ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఒకరు సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ ఆ వీడియో ద్వారా బెదిరించాడు.
సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో ఒకరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. కేసును విచారించేందుకు క్రైమ్ బ్రాంచి అధికారులు రాజస్థాన్ వెళ్లారు. రాజస్థాన్ కు చెందిన బన్వరీలాల్ గుర్జార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ముంబై తరలించారు.
ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ పై దాడికి ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు అతని ఇంటిపై కాల్పులు జరిపి పారిపోయారు. వెంటనే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం విశేషం. అరెస్ట్ అయిన వారిలో ఒకరు కొద్ది రోజులకే జైలు లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.అభిమానులు తీవ్ర ఆందోళనచెందుతున్నారు. ఆయనకు మరింత భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగ సల్మాన్ ఖాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమస్యలతో తాను విసిగిపోతున్నానని అన్నారు. తనను మల్లి టార్గెట్ చేశారు. నాకు ఇబ్బందిగా ఉంది అంటూ ప్రకటన విడుదల చేశారు సల్మాన్ ఖాన్.