ration dealer : మంచిర్యాల జిల్లా పరిధిలోని రేషన్ డీలర్ల తో శనివారం జిల్లా రెవెన్యూ అధికారులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ నాయకులు సైతం హాజరైనారు. సమావేశంలో రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ రేషన్ దుకాణాలను ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నడపాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేవిదంగా డీలర్ దుకాణం ఉండాలన్నారు. డీలర్ కు కేటాయించిన పరిధిలోనే దుకాణం నడపాలన్నారు. మరోప్రాంతంలో నడిపితే చర్యలు తప్పవన్నారు. సమస్యలు ఉంటె సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని అధికారులు కోరారు.
ఈ సందర్బంగా కొందరు రేషన్ డీలర్లు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణం నిర్వహిస్తున్నా మన్నారు. కానీ నిబంధనల ప్రకారం సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు కొందరు డీలర్లు. చాలీ , చాలని కమిషన్లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా మన్నారు. రావాల్సినంత బియ్యం రాకపోవడంతో నష్టపోతున్నామన్నారు. చినిగిన సంచులతో సరఫరా చేయడం వలన కూడా బియ్యం తక్కువగా వస్తున్నామని, తద్వారా ఆర్థికంగా మరింత నష్టపోతున్నామని కొందరు డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.