Home » vijayashanti : ఎమ్మెల్సీ విజయ శాంతికి బెదిరింపులు

vijayashanti : ఎమ్మెల్సీ విజయ శాంతికి బెదిరింపులు

vijayashanti : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయ శాంతి దంపతులకు బెదిరింపులతో కూడిన మెసేజ్ వచ్చిన ఘటన చోటు చేసుకుంది. చంద్ర కిరణ్ రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులతో ఉన్నటువంటి సందేశాలు పంపాడని, తనకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించని నేపథ్యంలో తనకు మీరే శత్రువులు అవుతారని మెసేజ్ పంపినట్టుగా విజయ శాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు చంద్రకిరణ్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

గతంలో చంద్ర కిరణ్ రెడ్డి తమతో కలిసి పనిచేసాడు. అతని స్వార్థం కోసం మమ్మల్ని వాడుకున్నాడు. దింతో అతని పనితీరు నచ్చక పోవడంతో చంద్రకిరణ్ రెడ్డిని దూరం పెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ విజయ శాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఈ సందర్బంగ ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *