Virat Kohli : విజయంతోనే అభిమానుల కోరికను తీర్చుకోవాలని బెంగుళూర్ జట్టు కసిగా ఆడుతోంది. చెన్నయ్ జట్టుపై దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ గ విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్ రంగంలోకి దిగారు. ఒకవైపు గెలుపు భాద్యత, మరోవైపు రికార్డు సాధించాలి. ఈ రెండు బాధ్యతలను కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. కోహ్లీ 47 పరుగులతో ప్లెసిస్ 54 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. కానీ కోహ్లీ దూకుడుగా ఆడినప్పటికీ తన అర్ధ సెంచరీ కూడా చేజారి పోయింది. ఓపెనరాగా వచ్చిన వీరిద్దరూ 9.4 ఓవర్లలోనే 74 పరుగులు సాధించి జట్టుకు అండగా నిలిచారు. చెన్నయ్ బౌలర్లపై తమ దూకుడు ప్రతాపాన్ని చూపుతూ పరుగులు చేశారు. హాఫ్ సెంచరీ తప్పిపోయినప్పటికీ కోహ్లీ సరికొత్త రికార్డు సాధించి వారెవ్వా అనిపించుకున్నారు తన అభిమానులతో.
ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఒక సరికొత్త రికార్డు ను సృష్టించాడు. గొప్ప ఘనత సాధించి తొలి క్రికెటర్ గ చరిత్రకెక్కాడు. ఒకే వేదికపై ఆడి మూడువేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా చరిత్ర పుటల్లో తన పేరు నమోదు చేసుకోవడం విశేషం. చెన్నయ్ జట్టుపై ఆడి కోహ్లీ ఈ రికార్డు సృష్టించడం విశేషం. తుషార్ దేశ్ పాండే బౌలర్ వేసిన బాల్ ను కోహ్లీ బాదడంతో బంతి సిక్సర్ అయ్యింది. అప్పటివరకు ఉన్న కోహ్లీ పరుగులు 3005 కు చేరుకోవడం విశేషం. దీనితో ఒకే వేదికపై మూడువేల పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.