Home » Hyderabad Ashadam Bonalu : హైదరాబాద్ లో బోనాలు జరుపుకోడానికి కారణం ఏమిటి ???

Hyderabad Ashadam Bonalu : హైదరాబాద్ లో బోనాలు జరుపుకోడానికి కారణం ఏమిటి ???

Hyderabad Ashadam Bonalu : హైదరాబాద్ లో ఆషాడ మాసం బోనాల పండుగకు ఒక ప్రత్యేకత. నెల రోజుల పాటు హిందువుల ఇళ్లల్లో పండుగ వాతావరణం ఉంటుంది. భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ఉపవాసంతో రోజంతా దీక్షగా ఉంటారు. ఉపవాసంతోనే బోనం వండి అలంకరిస్తారు. అమ్మవారికి కొత్త బట్టలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. బోనం నెత్తిన ఎత్తుకొని అమ్మవారి ఆలయంలో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పుడు హైదేరాబద్ నగరం బోనాల వేడుకకు ఆషాడ మాసం వేదిక అయ్యింది.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆషాడ మాసంలో బోనాలతో మొక్కులు చెల్లించడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాంతం దేశంలోనే బోనాలకు పేరు పొందింది. ఇక్కడ రంగం కార్యక్రమాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా విని ఆనందిస్తారు. లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో ఇదే మాసంలో ప్రతి గురు వారం, ఆదివారం రోజులల్లో బోనాలతో అమ్మవారికి మొక్కులు ఘనంగా చెల్లించు
కుంటారు భక్తులు. వివిధ రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. గోల్కొండలోని జగదాంబికా గుడిలో తొలి బోనంతో బోనాల పండుగ ప్రారంభం అవుతుంది.

ఆషాడ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజు భాగ్యనగరంలో బోనాల జాతర మొదలవుతుంది. గోల్కొండలో శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆ తరువాత వచ్చే రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర మొదలవుతుంది. ఇక్కడి బోనాలకు దేశ వ్యాప్తంగా గొప్ప పేరు ఉంది. ఇక్కడ చెప్పే రంగం కార్యక్రమాన్ని వినటానికి భక్తులు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివస్తారు. రంగం కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వింటారు.
మూడో ఆదివారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో ప్రతి గురు, ఆదివారం రోజులల్లో బోనాల పండుగ నిర్వహిస్తారు.

హైదరాబాద్ పట్టణంలో బోనాల జాతర ప్రతి ఏటా మూడు దశలల్లో భక్తులు నిర్వహిస్తారు. మూడు దశల్లో జరిగే బోనాలకు గోల్కొండ బోనాలు , లష్కర్ బోనాలు , ఉజ్జయిని మహంకాళి బోనాలు అనే పేర్లతో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలోని హరీబౌలి లో నెలకొల్పిన అక్కన్న, మాదన్న మహంకాళి దేవాలయం, అదేవిదంగా లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి దేవాలయం లో జరిగే బోనాల జాతరతో ఉత్సవాలు ముగుస్తాయి.

హైదరాబాద్ నగరంలో సుమారు 150 సంవత్సరాల కిందట కలరా వ్యాధి సోకింది. ఆ వ్యాధికి గురై చాలా కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. అమ్మవారి ఆగ్రహంతోనే కలరా వ్యాపించిందని ప్రజలు నమ్మారు. అప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు హైదరాబాద్ ప్రజలు. అప్పటి నుంచి కలరా అనేది లేకుండా పోయింది. అదే నమ్మకంతో ప్రతి ఏటా ప్రజలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో బోనాల జాతర నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆ విదంగా హైదరాబాద్ నగరంలో బోనాల జాతర మొదలైనది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *