Green Banana : అరటికాయ రెండు రకాలు. ఈ రెండు రకాలను తింటాము. కానీ ఒకటి కూరకు ఉపయోగిస్తాము. మరొకటి సాధారణంగా తినడానికి అరటిపండును ఉపయోగిస్తాం. కూరకు వాడుకొనే పచ్చి అరటికాయలో కావలసినన్ని పోషకాలు ఉన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి మరియు విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు
అధికంగా ఉన్నాయి. అరటిపండు ను తినడం వలన దగ్గు, జలుబు సమస్యలను దూరం పెట్టవచ్చు. కడుపులో వచ్చే జీర్ణవ్యవస్థ సమస్యలను కూడా కూడా నివారిస్తుంది.
పచ్చి అరటికాయ ను కూర గా వండుకొని ఆహారంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. బరువు పెరగకుండా సహాయ పడుతుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా మోతాదులో ఉంటాయి. పొటాషియం అధికంగా ఉంటుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బులను కొంతమేరకు తగ్గిస్తుంది. పచ్చి అరటికాయలు కార్బోహైడ్రేట్లకు మంచి ఆధారం. శక్తి సామర్ధ్యాలను పెంచుతాయి. చర్మానికి మేలవుతుంది. ఇందులో ఉండే సి విటమిన్ చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. ఎముకలను దృడంగా తయారుచేస్తుంది. పచ్చి అరటికాయతో కూర చేసుకోవచ్చు. చిప్స్, బజ్జీలు తయారు చేసుకోవచ్చు.
పిండి వంటలలో కూడా ఉపయోగించుకోవచ్చు.