Power : రాష్ట్రంలోని విద్యుత్ అర్దిజెన్స్ సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో ఆయన కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారి 2025 నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన అసోసియేషన్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ …..
విద్యుత్ ఉద్యోగుల, ఆర్టికల్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ కోసం కృషిచేస్తుందన్నారు. వారికి అండగా నిలబడటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం పరిధిలోని ఏ ఒక్క ఉద్యోగస్తుణ్ణి కూడా తక్కువగా చూసే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఉద్యోగులను తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు నాంపల్లి.బాలనర్సు, బాలేశం, రాజేందర్, రాజమల్లయ్య., నరసింహులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.