Singareni : 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గుగని కార్మికులు సాధించిన లాభాల్లో 33 శాతం కార్మికులకు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టినట్టు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తెలిపారు. గోదావరి ఖని పట్టణంలోని చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరసన దీక్ష చేపటాడుతున్నామని బాల్క సుమన్ తెలిపారు.
సింగరేణి కార్మికులకు న్యాయంగా రావాల్సిన లాభాల వాటా పంపిణి అయ్యేవరకు కూడా బిఆర్ఎస్ , తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం దశల వారీగా పోరాటం చేస్తుందన్నారు. కార్మికుల లాభాల వాటా పంపిణి చేసే విధానంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడు కూడా మోసం చేయలేదన్నారు. కార్మికుల హక్కులను కాపాడిన చరిత్ర కేవలం కేసీఆర్ కె దక్కుతుందన్నారు.
గోదావరి ఖనిలో చేపట్టిన ఒక్క రోజు నిరసన దీక్ష కార్యక్రమానికి సింగరేణి విస్తరించిన అన్ని ప్రాంతాల నుంచి కార్మికులు, బిఆర్ఎస్ తోపాటు పార్టీ అనుబంధ సంఘాల భాద్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా బాల్క సుమన్ కోరారు.