AITUC : సింగరేణి బొగ్గుగని ట్రేడ్స్ మెన్ ల అపరిష్కృత హక్కులను సాధించిపెడుతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ జెనరల్ బాడీ సమావేశానికి వారు హాజరై ట్రేడ్స్ మెన్ లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ట్రేడ్స్ మెన్ లకు అమలవుతున్న హక్కులన్నీ కూడా ఏఐటీయూసీ సాధించినవేనన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని హక్కులను సాధించి తీరుతామని, వారికీ అండగా ఉండేది కేవలం ఏఐటీయూసీ మాత్రమేనని అన్నారు.
అదేవిధంగా ట్రేడ్స్ మెన్స్ సోదరులు మెడికల్ అన్ ఫీట్ అయితే సూటబుల్ జాబ్ ఇవ్వాలని, ట్రేడ్ మెన్స్ సోదరులకు పర్మినెంట్ హెల్పర్ను కేటాయించాలని, ఏరియా ఫిక్సేషన్ చేయాలని, మెరుగైన చార్జ్ అలవెన్స్, డిసిగ్నేషన్ మార్చడం వంటి సమస్యల పరిస్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం ట్రేడ్స్ మెన్స్ సబ్ కమిటీ ఏఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో బ్రాంచ్ కార్యదర్శి గా ఎం. రాజేంద్రప్రసాద్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు గా నాగభూషణం, సహాయ కార్యదర్శిగా టి. సురేష్, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆళ్ల వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా రంగు రమేష్ ,మురళి, పద్మరాజు, జె శ్రీనివాస్, కే సాగర్, మల్లెత్తుల శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కి సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదా, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జిఎం కమిటీ చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, ఫిట్ కార్యదర్శిలు మురళి చౌదరి, సంఘం సదానందం, మారుపెల్లి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.