Mega Family : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రచారం వేడి తగ్గింది. రాజకీయ నాయకుల్లో పట్టు విడుపులు తగ్గాయి. కానీ మెగా ఫ్యామిలీ లో వేడి పెరిగింది. మెగా అభిమానుల్లో పట్టు అదుపుతప్పుతోంది. కేవలం ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ తన మిత్రుడి కోసం వెళ్ళాడు. మిత్రుడు శిల్ప రవి చంద్ర రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అల్లు అర్జున్ భార్యాతో కలిసి అయన ఇంటికి వెళ్లారు. బన్నీకి అక్కడ ఘనంగా స్వాగతం పలికారు. బన్నీ తన అభిమానులకు, వైసీపీ నాయకులకు అభివాదం చేశారు. కానీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మామ అవుతారు బన్నీకి. పవన్ కళ్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం వెళ్లకుండా కేవలం మామ గెలుపు కోసం బన్నీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మామకు సోషల్ మీడియా లో ప్రచారం, మిత్రుడి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడంతో బన్నీ వివాదంలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో వివాదం నిలిచిపోతుందని మెగా అభిమానులు భావించారు. కానీ ” మన అనుకున్న వాడు పరాయివాడికి మద్దతు ఇస్తే వాడు కూడా పరాయివాడే అవుతాడు ” అంటూ నాగబాబు ఓ ట్విట్ చేసారు. అది సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. నాగబాబు ట్విట్ చూసిన బన్నీ అభిమానులు నాగబాబు పై కామెంట్ పెడుతూ వచ్చారు. ఇది గత కొన్ని రోజుల నుంచి నడుస్తోంది.
ఇంతలో బన్నీ పేరుతో మరో ట్విట్ వెల్లడైనది. అది బన్నీ పెట్టాడా, లేదంటే అయన అభిమానులే పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.
బన్నీ పెట్టిన కామెంట్ ఈ విదంగా ఉంది. ” మా తాత అల్లు రామలింగయ్య లేకపోతే నువ్వు బాపట్ల పోస్ట్ ఆఫీస్ వద్ద పంచర్లు చేస్తూ ఉండే వాడివి ” అంటూ నాగబాబు ను ఉద్దేశించి ఆయన పేరుతో చేసిన ట్విట్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ట్విట్ నిజంగా బన్నీ చేశాడా ? అయన పేరు మీద అయన అభిమానులే చేశారా అనేది అనుమానంగానే ఉంది. బన్నీ మాత్రం నాగబాబుపై మాత్రం ఆ విదంగా కామెంట్ పెట్టడనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు కొందరు వ్యక్తం చేయడం విశేషం. మొత్తానికి మెగా ఫ్యామిలీలో మామ, అల్లుళ్ళ సవాల్ నడుస్తోంది.