Home » INTUC : శ్రీ చైతన స్కూల్ యాజమాన్యంపై కలెక్టర్ పిర్యాదు

INTUC : శ్రీ చైతన స్కూల్ యాజమాన్యంపై కలెక్టర్ పిర్యాదు

INTUC : మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నిర్వహణపై ఐఎన్టీయూసి పట్టణ అధ్యక్షులు వడ్లకొండ రంజిత్ గౌడ్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమవారం ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా రంజిత్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల ఆవరణ అంతా కూడా నీటితో నిండుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పాఠశాలకు విద్యార్థులను తీసుకువచ్చే తల్లి,దండ్రులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రత్యక్షంగా ఇబ్బందులు కనబడుతున్నప్పటికీ పాఠశాల నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాఠశాలలో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వర్షపు నీరు నిండిపోవడంతో దోమల వాతావరణంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల తల్లితండ్రులు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందన్నారు. అదే విదంగా పలు తరగతి గదుల్లో కూడా వెలుతురు కూడా లేదని, అటువంటి గదుల్లోనే ఇబ్బంది పడుతూ విద్యార్థులు పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల AGM అరవింద రెడ్డీ ఫోన్ చేసినప్పటికీ స్పందించడంలేదని ఆరోపించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *