Ardinense : తెలంగాణలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించి బీసీ వర్గాల నుంచి మార్కులు సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయత్ రాజ్ చట్టంలో కొన్ని సవరణలు చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్దకు చేరడంతో గవర్నర్ సంతకం పెడుతారా ? లేదా అనేది ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్య అయ్యింది.
సీఎం రేవంత్ రెడ్డి గుడ్డిగా గవర్నర్ కు ఆర్డినెన్స్ ఫైల్ పంపరు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న అనంతరమే ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి ఆమోదం అవసరమున్నటువంటి ఆర్డినెన్స్ లను కూడా గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశాలు తక్కువే అంటున్నారు రాజకీయ పండితులు. తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయపరిశీలనకు కూడా పంపే అవకాశాలు ఉంటాయంటున్నారు.
గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ ప్రభుత్వం చేతికందడమే అత్యంత కీలకం. గవర్నర్ ఆమోదం పొందితే కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతం అయినట్టు. కాలేదంటే ప్రతిపక్షాలకు అవకాశం దొరికుతుంది. ప్రభుత్వ వాదనలను గవర్నర్ సంతృప్తి చెందితే ఆర్డినెన్స్ జారీ అవుతుంది. ప్రభుత్వం కూడా ఎన్నికలకు వెళుతుంది. లేదంటే ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కష్టాలను ఎదుర్కోవడం తప్పదు.

by