RSS : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్ లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మంచిర్యాల పట్టణ స్థాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సంఘ్ నగర కార్యవాహ పర్వతాల నర్సయ్య సోమవారం తెలిపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి 2025, విజయ దశిమితో వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని క్షేత్రాల విస్తృత స్థాయి కార్యకర్తలతోపాటు హిందూ బంధువులను సైతం కలుపుకొని శతాబ్ది ఉత్సవాలను ఏర్పాటు చేయడమైనదని నర్సయ్య ఈ సందర్బంగా తెలిపారు.

ఈ సమావేశానికి వనవాసి కల్యాణ పరిషత్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి తాడేపల్లి శివరామకృష్ణ ప్రధాన వక్తగా రానున్నారు. కాబట్టి ప్రతి హిందూ కుటుంబంతో పాటు అన్ని క్షేత్రాల కార్యకర్తలు సమావేశం నిర్వహించే సమయానికి పది నిమిషాల ముందుగా రావాల్సిందిగా ఆయన కోరారు.

by