Dress : ప్రస్తుత రోజుల్లో వస్త్ర దుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేసి టైలర్ లో ఇవ్వడం లేదు. ఎక్కువ మంది రెడీమేడ్ దుస్తులకే ఆకర్షితులవుతున్నారు.రెడీమేడ్ దుకాణాల్లో కొన్న తరువాత వెంటనే వేసుకుంటున్నారు. ఇది సరయిన పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దుకాణంలో కొన్న దుస్తులను వెంటనే వేసుకోరాదంటున్నారు నిపుణులు. ఎప్పుడు వేసుకోవాలో అనే విషయాన్నీ ఈ విధంగా చెబుతున్నారు ఆరోగ్యనిపునులు.
రెడీమేడ్ దుస్తుల దుకాణంకు వెళ్లిన వారు తమకు సరిపడే దుస్తులను వేసుకొని చూసుకుంటారు. ఇలా కొందరు కనీసం ఐదు నుంచి పది వరకు నచ్చిన దుస్తులను వేసుకొని చూసుకుంటారు. సరిపడిన వాటిని కొంటారు. ఇలా వేసుకొని చూసుకోవడం వలన ఆ దుస్తుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. క్రిములు వ్యాప్తి చెందుతాయి. దీనివలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి దుస్తులను కొన్న వెంటనే వేడి నీటిలో కొద్ది సేపు ఉంచాలి. ఆ తరువాత నాణ్యమైన సబ్బు లేదా సర్ఫ్ తో ఉతకాలి. ఆరిన వాటిని ఇస్త్రీ చేసిన తరువాత వేసుకోవాలి. ఈ విధంగా దుస్తులు వేసుకోవడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.