Serious Actor : ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా దర్శక, నిర్మాతలు సన్నివేశాలను షూటింగ్ చేస్తారు. నటీ, నటులు కూడా దర్శక, నిర్మాతలు కూడా చెప్పినట్టు నటిస్తారు. అంతేకాదు వాళ్లు చెప్పినట్టు షూటింగ్ లో దుస్తులు కూడా వేసుకోవాలి. జుట్టు కూడా చెప్పినట్టు గానే హెయిర్ స్టైల్ ఉండాలి. లేదంటే దర్శక, నిర్మాతలకు, నటీ, నటులకు గొడవ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో షూటింగ్ కూడా నిలిచిపోతుంది. ఇటీవల ఒక షూటింగ్ లో దర్శకుడు చెప్పినట్టు గా ఆ సినిమా హీరోయిన్ వినలేదు.. ఆలా నటించమంటే అస్సలు ఒప్పుకోలేదు. ఆ దర్శకుడితో గొడవపడింది. ఇంతకూ ఆ నటి ఎవరు ….
ప్రముఖ నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విధంగా తెలిపింది. ” ఉలజ్ ” సినిమాలో పాత్రకు తగినట్టుగా నటించాలని దర్శకుడు కోరాడు. అందుకు నేను అస్సలు ఒప్పుకోలేదు. దర్శకుడు కూడా నేను అలా నటించనని చెప్పినా ఒప్పుకోలేదు. చివరకు దర్శకునితో గొడవపడ్డాను అంటూ వివరించింది. నా మొదటి సినిమా కోసం జుట్టు కత్తిరించుకొని నటించా . ఆ విషయం తెలిసి మా అమ్మ కోపం చేసింది. ఇప్పుడు ఉలజ్ సినిమాలో కూడా దర్శకుడు జుట్టు కత్తిరించుకోవాలని కోరాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. దర్శకుడు కూడా ఒప్పుకోలేదు. జుట్టు కత్తిరించుకోవాల్సిందే అన్నాడు. అప్పుడు నేను దర్శకుడితో గొడవ పడ్డాను అంటూ ఆ సంఘటన గురించి వివరించింది జాన్వీ కపూర్.