Mahesh babu : మహేష్ బాబు కొత్త సినిమాకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. జనవరి 2న SSMB29 పేరుతో అధికారికంగా లాంచ్ కాబోతుంది.ఇంతకూ దర్శకుడు ఎవరనుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా దర్శకుడు రాజమౌళి , మహేష్ బాబుతో సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజమౌళి కళ నిజం కాబోతోంది.
కొత్త సినిమా SSMB29 కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని దర్శకుడు రాజమౌళి కార్యాలయంలోనే ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో కూడా తెలియదు. అంత రహస్యంగానే ఉంచుతున్నారు. మహేష్ బాబుకు ఒక సెంటిమెంట్ ఉంది. సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ బాబు ఎప్పుడు కూడా రారు. వచ్చిన సందర్భాలు సైతం లేవు. ఇప్పుడు కూడా వస్తాడో రాడో తెలియదు.
ఇంకా సినిమా పేరు మాత్రం ఖరారు కాలేదు. అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి చిత్ర పరిశ్రమ దృష్టి వీరిద్దరి పైననే ఉంది. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. దాదాపుగా రెండు సంవత్సరాలు పెట్టె అవకాశం ఉందంటున్నారు చిత్ర బృందం. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలు అంత ఖరీదుతో ఉంటాయి కాబట్టి.