Janvi kapoor : ప్రముఖ తెలుగు సినీ నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ చేస్తున్న సినిమా ” దేవర “. ఇదే మొదటి సినిమా తెలుగులో. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్. ఎన్టీఆర్ తో ” దేవర ” లో నటిస్తున్న జాన్వీ కి మంచి భవిష్యత్తు ఉందని తెలుగు పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి జాన్వీ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు సమాచారం. నాని సరసన నటించడానికి ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అదేవిదంగా చరణ్ తో కూడా అంగీకారం కుదిరిందని, వీటితో పాటు బన్నీ తో కూడా నటించాలని దర్శకుడు త్రివిక్రమ్ కూడా కోరినట్టు తెలిసింది.
జాన్వీ కపూర్ నటించడం, నటించకపోవడం ఇప్పుడు ఆమె చేతిలో లేదని చిత్రపరిశ్రమలో గుసగుస పెట్టుకుంటున్నారు. ఏదయినా సినిమా ఒప్పుకోవాలన్నా, సినిమాకు ముందుగా అడ్వాన్స్ తీసుకోవాలన్నా ఆమె చేతిలో ఏమి లేదు. చివరకు ఎవరైనా దర్శకుడు వచ్చి ఒక కథ చెబితే వినాలంటే కూడా ఆమెకు అవకాశం లేదు. పారితోషకం తీసుకోవడంలో కూడా చివరకు ఆమెకు ఎలాంటి హక్కు లేదు. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే జాన్వీ కపూర్ తండ్రి బోని కపూర్ అని చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. బోని తీసుకుంటున్న నిర్ణయాల వలన జాన్వీ కి రావలసిన అవకాశాలు వెళ్ళిపోతున్నాయని చిత్ర పరిశ్రమలో అనుకుంటున్నారు.
వాస్తవానికి హీరోయిన్ లు కొందరు తమ తల్లి పై ఆధారపడి నటనకు ఒప్పుకుంటారు. మరికొందరు తండ్రిపై ఆధారపడుతారు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకంగా మేనేజర్ ను నియమించుకుంటారు. జాన్వీ మాత్రం పూర్తిగా తండ్రి బోని కపూర్ పై ఆధారపడింది. చిత్ర పరిశ్రమ గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ఏది మంచో, ఏది చెడో తెలిసిన వ్యక్తి. కూతురు ఎదుగుదల కు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలిసిన తండ్రి. కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో జాన్వీ కపూర్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతాయని చిత్ర పరిశ్రమలో పలువురు చర్చించుకుంటున్నారు.