Ex CM Ys Jagan : రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా అది నిజమే అవుతుంది. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాబట్టి. అందుకే ప్రజలను చూస్తే చాలు మైకులు అలసిపోతాయి. కానీ నాయకులు అలసిపోరు. ఇప్పుడు ఏపీ లో కూడా అదే జరుగుతోంది. వైఎస్సార్ సీపీ నాయకులు కూడా ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత జగన్ కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడంలో విఫలమైనట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఏపీలోని అచ్యుతాపురంలో జరిగిన ఘటన పై ఆయన మాట్లాడిన మాటలు విన్న వైసీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నారు.
అచ్యుతాపురం సంఘటన పై సుదీర్గమైన విచారణ చేపట్టాలని మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిదంగా ప్రభుత్వం పరిహారం కూడా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరణించిన వారికి రూ : కోటి. తీవ్రంగా గాయపడిన వారికి రూ : 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అధికారులు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని స్పష్టం చేశారు.
ముందుగా చంద్రబాబు స్పందించి బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా నిలిచిన తరువాత జగన్ మాట్లాడటంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పిన తరువాత కూడా ధర్నా చేస్తామని ప్రకటించడంపై వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తలపట్టుకుంటున్నారు. ఈ విదంగా జగన్ మాట్లాడటం వెనుక రాజకీయ ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో పరిహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మేము ప్రభుత్వాన్ని నిలదీస్తేనే స్పందించి పరిహారం ఇచ్చిందనే విషయాన్నీ జగన్ తన ఖాతాలో వేసుకుంటారు కావచ్చనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.