Home » వెంకటేశ్వర స్వామికి శనివారంకు సంబంధం ఏమిటి ???

వెంకటేశ్వర స్వామికి శనివారంకు సంబంధం ఏమిటి ???

Tirupathi venkanna ఏడుకొండల వెంకన్న…ఆపద మొక్కులవాడు….తిరుపతి దేవుడు… వెంకన్న స్వామి… వెంకటేశ్వర స్వామి…. శ్రీనివాసుడు… ఈ పేర్లన్నీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కే సొంతం. ఇలా ఏ పేరుతో పిలిచినా నేను ఉన్నా అంటూ భక్తుల కోర్కెలను తీర్చే కలియుగ అవతార ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. వెంకటేశ్వర స్వామికి శనివారం కు ఉన్న సంబంధం ఏమిటి ??? శనివారమే ఎందుకు ఆ స్వామికి పూజలు చేయాలి.

అదే రోజు ఎందుకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఆరోజున ఎందుకు ఉపవాసం ఉండాలి. మరో రోజు ఎందుకు ఉండరాదు. తిరుపతిలో కూడా అదే రోజు దర్శనము చేసుకోవాలి అని అంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీనివాసునికి శనివారం రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ??? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే శ్రీనివాసుని చరిత్ర ఆధారంగా అందిస్తున్న ప్రత్యేక కథనం చదవాల్సిందే…..

శ్రీనివానుడికి శనివారం అంటే అంత ఇష్టం ఎందుకు ….
భక్తులు వెంకన్న స్వామిని శనివారం పూజిస్తారో వారికీ శని భాదలు ఉండవని శని దేవుడు ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పింది శనివారమే. కలియుగం ఆరంభంలో వెంకన్నను భక్తులు ,మొదటిసారి దర్శనం చేసుకున్నది కూడా శనివారమే కావడం విశేషం. ఓం కారం ఉద్బవించినది కూడా శనివారమే. అందుకనే శనివారం రోజు వెంకన్నకు అత్యంత ఇష్టమయిన రోజు. తొండమాన్ రాజును ఆలయం కట్టించమని వెంకటేశ్వర స్వామిని కోరింది కూడా శనివారమే .

ఆ ఆలయంలో మొదటిసారి స్వామి ప్రవేశం చేసింది సైతం శనివారమే అమ్మవారు పద్మావతిని వివాహం చేసుకుంది శనివారమే శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారమే. శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసింది శనివారమే శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమే . సుదర్శన చక్రం పుట్టింది కూడా శనివారమే.

అందుకనే భక్తులు తమ ఇష్ట డైవమైన వెంకటేశ్వర స్వామి కి ఉపవాసం ఉంది తమ మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజు తిరుపతిలో దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం పొందుతారని నమ్మకం.

సూచన : ఈ విదంగా తెలిపిన వివరాలు పలువురు వేద పండితులు తెలిపినవే. వేదం,చరిత్ర ఆధారంగా లభించినవి మాత్రమే. కాబట్టి భక్తులు నమ్మడం అనేది వారి,వారి ఇష్ట ప్రకారమే .

—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *