CPM : రాష్ట్రంలోని రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలేనని, అందుకు బాధ్యులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి ఆరోపించారు. గురువారం చెన్నూరు మండల స్థాయి ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ సభకు కరిమ నాగజ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన అతివృష్టికి నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం మంజూరు చేయకపోవడంపై అయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దేశంలో ఒకవైపు పేదరికాన్నిపెంచుతూ, మరోవైపు సంపదను కార్పొరేట్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ హక్కుల కోసం, న్యాయమైన సమస్యల పరిస్కారం కోసం ఉద్యోగులు, కార్మికులు,విద్యార్థులు, యువత,ఆదివాసీలు, రైతులు చేస్తున్న పోరాటాలను నిర్బంధాలతో అణిచి వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకొని, ప్రజా సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో ఉద్యమాలు ఉదృతం చేయడం జరుగుతుందన్నారు.
ఈ మహాసభలో 20 మందితో కూడిన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో చెన్నూర్ మండల నూతన కార్యదర్శిగా బొడెంకి చందు ను ఎన్నుకున్నారు. ఈ మహాసభలో బోడంకి చందు, పాయిరాల రాములు, కరిమా నాగజ్యోతి, సరిత,నగేష్, బొందయ్య, రమాదేవి, కృష్ణమ చారి, అనిల్, కమల, దుర్గమ్మ, మధు తో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

by