Singareni : సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం విధానం సవరించి ఐపవర్ విధానంతో చెల్లించాలని ఐఎఫ్ టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎండి.రాసుద్దిన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఐ.క్రిష్ట మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు ఐ పవర్ వేతనాలు 13 సంవత్సరాలుగా అమలు చేయడంలేదన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు 18 రోజుల పాటు సమస్యల పరిష్కారoకై నిరవధిక సమ్మె చేసినప్పటికీ యాజమాన్యం కాలయాపన చేయడం సరికాదన్నారు. యూనియన్ లతో సంబంధం లేనివారితో చర్చలు జరిపిన యాజమాన్యం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆయన ఆరోపించారు.
అపరిష్కృత సమస్యల పరిస్కారం కోసం భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టియు) జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపు నిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాదులో జరుగనున్న సదస్సులో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశoలో కొత్తగూడెం,బెల్లంపల్లి,భూపాలపల్లి,రామగుండం రీజియన్ల సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (IFTU) వర్కింగ్ ప్రెసిడెంట్ డి.బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న సహాయకార్యదర్శి జే.సీతారామయ్య, ఈ. నరేష్, బి.అశోక్, కొండపల్లి శీను, ఎన్.సంజీవ్, మోత్కురి మల్లికార్జున్, అంజయ్య, మల్లేష్, పద్మ, బుచ్చమ్మ, రమేష్, శేఖర్, యాదగిరి, సదానందం, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

by