Panasa : ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న ప్రతి పండు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. క్రమం తప్పకుండా పళ్ళను ఆహారంగా తీసుకునే వారికి వైద్యుడితో అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో భాగంగా పనస పండుతో శరీరానికి పుట్టెడు లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పనస పండులో ఉండే విటమిన్ ఎ, కారోటెనోయిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాల్షియం, మెగ్నీషియ, విటమిన్ కె ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని అభివృద్ధి చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. రక్తపోటుని నివారిస్తుంది. మలబద్దకం సమస్య ఉండదు.
పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. నిత్యం తీసుకోవడం వలన ఒంటినొప్పులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. అజీర్తి, మలబద్దకం సమస్యలతో బాధపడేవారికి ఔషధంలా పనిచేస్తుంది.