Chanakyudu : నిత్య విద్యార్ధి కి ఎన్నో ఆశలు ఉంటాయి. చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. సమాజంలో గౌరవం పొందే ఉద్యోగం చేయాలనీ కళలు కంటాడు. వీటన్నిటికీ ఒక్కటే పరిస్కారం అంటారు గొప్ప ఆర్థిక మేధావి చాణక్యుడు. విద్యార్ధి దశలో కొన్నిటిని ఒదులుకుంటేనే తన లక్ష్యం చేరుకుంటాడని తన గ్రంధాల్లో స్పష్టం చేశారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..
విద్యార్ధి దశలో ఉన్నవారికి కోపం ఉండరాదు. కోపం జ్ఞాపక శక్తిని పోగొడుతుంది. నిరాశకు గురిచేస్తుంది. చదువుపై అనాసక్తి చూపుతుంది. పట్టుదల అనేది తప్పనిసరి. చదువులో పట్టుదల లేకుంటే అనుకున్నది సాధించలేము. చదువులో కూడా వెనుకబడిపోతారు.దురాశ అనేది ఉండరాదు. దురాశ అనేది తన లక్ష్యాన్ని చెడగొడుతుంది. దురాశ ఉన్నవారికి సాధ్యం కానీ చదువులు చదివి నష్టపోతారు.
అలంకరణ అనేది అవసరంలేదు. అలంకరణ కు పెట్టే ఖర్చులతో పుస్తకాలు కొనవచ్చు. అలంకరణపై ద్యాస ఉన్నవారికి చదువుపై అశ్రద్ధ ఏర్పడుతుంది. అతిగా నిద్ర, తిండి కోరికలు ఉన్నవారు చదువులో వెనుకబడిపోతారు. ఎందుకంటే ఎక్కువసేపు నిద్ర పోయేవారికి చదువుకు సమయం కేటాయించలేరు. తిండి పై కోరిక ఉన్నవారు సైతం చదువుపై దృష్టి పెట్టలేరు. వీటి వలన విద్యార్ధి చదువులో ఎప్పుడు కూడా వెనుకబడిపోతారు. లక్ష్యాన్ని సాధించలేరని చాణక్యుడు తన గ్రంథాల్లో పేర్కొన్నారు.