Bibipeta : బీబీపేట మండలం కేంద్రంతో పాటు, మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌజ్ పనులను ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ పరిశీలించారు.
అనంతరం శివరాం రెడ్డి పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని యాడారం లో చేపట్టిన నర్సరీ పనులు, తాగునీటి సరఫరా పనులను, శానిటేషన్ పనులను కూడా ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ పరిశీలించారు. మల్కాపూర్ గ్రామంలోని సీసీ రోడ్ పనులను కూడా ఎం శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ తో పాటు మండలంలోని ఇతర అధికారులు, అధికారులు, సిబ్బంది, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.