Sun flower : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది పొద్దు తిరుగుడు, గుమ్మడి, అవిశ గింజలను ఆహారంగా తీసుకుంటున్నారు. కొందరు అధిక రక్త పోటు, డయాబెటిస్ అదుపులో ఉండటానికి పొద్దు తిరుగుడు గింజలను తింటున్నారు. వీటిని తినేవారిలో కొందరికి వాటి గురించి తెలిసే తింటున్నారు. కానీ పొద్దు తిరుగుడు గింజలను తింటే పుట్టెడు లాభాలు శరీరానికి కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పిరికెడు పొద్దు తిరుగుడు గింజలను తింటే కలిగే ప్రయోజనాలు ఈ విదంగా ఉన్నాయి.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం, ఫైబర్, పాలీఫెనాల్స్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తాయి.
శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించడానికి సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్‌ను నివారించేందుకు వీటివల్ల ప్రయోజనం కలుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే చర్మ సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు పెరగకుండా ఉంటారు.