meals : భోజనం చేయడానికి ప్రతి ఇంటిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు డైనింగ్ టేబుల్ ను వాడుతున్నారు. మరికొందరు పీటలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. కొందరు బల్లలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేసే పద్దతిని పాటిస్తే మీరు ఎల్లవేళలా ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యముగా ఉండాలంటే నేలపై కూర్చొని భోజనం చేయాలనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చొని తినడం వలన ముందుకూ, వెనుకకు వంగుతాం. ఇలా చేయడం వలన శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేస్తాయి. తిన్న ఆహారం కూడా తొందరగా జీర్ణమవుతుంది. కండరాలు సరిగా పనిచేయడంతో కడుపు నిండిన తృప్తి కలుగుతుంది.
టేబుల్, కుర్చీ పై కూర్చొని తినడం వలన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. కండరాలు బిగుసుకుపోయి జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయదు. బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.