Prayag : ప్రయాగ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసు కుంది. కుంభమేళాలో ఒక శిబిరంలో ప్రమాదవ శాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ స్పందించి మంటలను ఆర్పివేసింది. దింతో పెద్ద ప్రమాదం తప్పింది. భక్తులు ఊపిరి తీసుకున్నారు. ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
19సెక్టార్ క్యాంప్ ప్రాంతంలో కొన్ని సిలిండర్లు పేలినట్టుగా అధికారులు గుర్తించారు. ఇవి పేలుడుతోనే అగ్నిప్రమాదం జరిగినట్టుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారని సమాచారం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. పలు గుడారాలు మంటలకు బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోవడంతో అధికార వర్గం ఊపిరి పీల్చుకుంది.