Home » Milk : ఎలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా ?

Milk : ఎలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా ?

Milk : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రతిరోజూ కొందరు పాలు తాగుతారు. పాలల్లో మార్కెట్ లో లభ్యమయ్యే వివిధ రకాల పొడులను కూడ కలుపుకొని తాగుతుంటారు. మరికొందరు వేడిచేసినవి తాగుతారు. ఇంకొందరు పచ్చి పాలను కూడా తాగుతారు. ఇందులో ఎలాంటి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వేడి చేసిన పాలను మాత్రమే తాగాలి అంటున్నారు వైద్య నిపుణులు. పచ్చి పాలను తాగరాదని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు. ఈ రెండింటిలో ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం.

పచ్చి పాలలో ఫ్లూ వైరస్ దాదాపు మూడు రోజులకు పైగా సజీవంగానే ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి పాలల్లోనే ప్రోబయోటిక్స్, పోషకాలు, ఎంజైమ్స్, ఎక్కువగా ఉంటాయని కొందరు అభిప్రాయ పడుతుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. పచ్చి పాలను వేడి చేయకుండా తాగితే పదుల సంఖ్యలో రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పచ్చి పాలను తాగడం వలన పలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలు మరిగే వరకు వేడి చేసి తాగితే అందులో ఉన్న క్రిములు నశిస్తాయి. అటువంటి పాలను తాగడం వలన శరీరానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *