Home » Mohan Babu : మోహన్ బాబు కు హై కోర్ట్ లో చుక్కెదురు

Mohan Babu : మోహన్ బాబు కు హై కోర్ట్ లో చుక్కెదురు

Mohan Babu : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు హై కోర్ట్ లో చుక్కెదురైనది. జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనపై మోహన్ బాబుపై కేసు నమోదయినది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద జరిగిన ఘర్షణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు అభ్యర్థనను హై కోర్ట్ తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ పై విచారణను గురువారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు అరెస్ట్ కూడా తప్పదేమో అనే అభిప్రాయాలు సైతం సినీపరిశ్రమలో వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *