Home » Singareni : సింగరేణి యాజమాన్యంతో మెరుగయిన ఒప్పందం…. AITUC

Singareni : సింగరేణి యాజమాన్యంతో మెరుగయిన ఒప్పందం…. AITUC

Singareni : సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తో సింగరేణి యాజమాన్యం 50వ స్ట్రక్చర్ సమావేశం కొత్తగూడెంలో నిర్వహించగా కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిస్కారమైనాయని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గత కొన్నేళ్లుగా సమస్యలు పరిష్కరానికి నోచుకోలేదన్నారు. దింతో కార్మిక వర్గం ఆర్థికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయిందన్నారు. గుర్తింపు సంఘం హోదా వచ్చిన వెంటనే యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సీతారామయ్య తెలిపారు.

మైనింగ్ స్టాప్ సూపర్వైజర్స్, ట్రేడ్స్ మెన్, ఈపి ఆపరేటర్లు మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి షూటబుల్ ఉద్యోగం ఇచ్చే అంశంపై యాజమాన్యంతో చర్చించగా, మైనింగ్ టెక్నికల్ సూపర్వైజర్లకు సూటబుల్ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని సీతారామయ్య తెలిపారు. అదేవిదంగా ట్రేడ్స్ మేన్ లకు, ఈపీ ఆపరేటర్లకు చైర్మన్ తో వచ్చే సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామని చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

డిస్మిస్ అయిన JMET ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవడా నికి అంగీకారం కుదిరింది. మిగతా వారిని కమిటీ వేసి నిర్ణయం తీసుకోడానికి అంగీకారం కుదిరింది. ప్రైవేట్ వారి అధీనంలో ఉన్న సింగరేణి క్యాంటీన్లన్నీ కూడా ఇకనుంచి యాజమాన్యం కొనసాగించనుంది. D-C, C-B ఖాళీలతో నిమిత్తం లేకుండా టైం బావుండు ప్రమోషన్లు ఈపీ ఆపరేటర్లకు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని సీతారామయ్య ఈ సందర్బంగా వివరించారు.

మెరిట్ స్కాలర్షిప్ ను ఇకనుంచి ఎనిమిది వేల ర్యాంక్ లోపు వచ్చిన కార్మికుల పిల్లలకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. శ్రీరాంపూర్ ఏరియా లోని ఓపెన్ కాస్ట్ , సీఎస్పీ లను విభజించి ఇన్సెంటివ్ ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు. వేజుబోర్డు కు సంబంధించిన 11 రకాల అలవెన్స్ లను సవరించుటకు కూడా యాజమాన్యంతో ఒప్పందం కుదిరిందన్నారు. కొత్త ఇన్సెంటివ్ ను అమలు చేయడానికి యాజమాన్యం.నిర్ణయం తీసుకుందని సీతారామయ్య తెలిపారు.

N-1 తీసివేయడానికి ఆడిటు బోర్డులో ఆమోదం తీసుకొని అమలు చేయనున్నారు. విజిలెన్స్ కేసులను వచ్చేనెల జరిగే C&MD సమావేశంలో చర్చించి పరష్కరించనుంది యాజమాన్యం. హెల్పర్ల విషయంలో డిసెంబర్ లో చైర్మన్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. క్యాడర్ స్కీములను రానున్న మూడు నెలల్లో పరిష్కరించడానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు.నిలిచి పోయిన ప్రోత్సాహక బహుమతులను తిరిగి ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందన్నారు. కార్మికుల అపరిష్కృత సమస్యలను కార్మిక గుర్తింపు సంఘం యాజమాన్యంతో చర్చించగా దాదాపుగా అన్నిటికి ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం కార్మిక వర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *