Hero Nagarjuna : ప్రముఖ తెలుగు చలన చిత్ర పరిశ్రమ నటుడు, హీరో నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కొంత వరకు దూరంగా ఉన్నారు. తన వారసుడు సినీ హీరో నాగ చైతన్య వివాహం పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. అతి తొందరలో వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి పనులన్నీ కూడా తనే స్వయంగా పరిశీలిస్తున్నాడు. కొడుకు నాగ చైతన్య వివాహం సంబరాల్లో ఉన్న నాగార్జున కు ఊహించని విదంగా పెద్ద షాక్ తగిలింది. ఒకవైపు తగిలిన షాక్ తో బాధపడుతున్న నాగార్జున. మరోవైపు కొడుకు పెళ్లి జరుగుతున్నదనే సంతోషం. ఆ ఆనందంలో ఉన్న నాగార్జునకు అనుకోకుండా వచ్చిన బాధను ఎలా దిగమింగుకోవాలో తెలియక తీవ్ర ఆవేదనలో ఉన్నారు సినీ హీరో అక్కినేని నాగార్జున.
హైదరాబాద్ లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనది. అందులో భాగంగా ” హైడ్రా ” ను ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్ గ సీనియర్ పోలీస్ అధికారి రంగనాథ్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయన 44 ఏళ్ళలో పట్టణంలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సహకారంతో ఒక నివేదిక తెప్పించుకున్నారు. శాటిలైట్ చిత్రాలను ఆధారం చేసుకున్నారు. వాటి ఆధారంగా 56 చెరువులు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. నగరంలోని ప్రతి చెరువు సమగ్ర నివేదిక ను సిద్ధం చేసుకున్నారు.
కబ్జాకు గురైన చెరువులను పరిశీలిస్తున్న కమిషనర్ రంగనాథ్ కు తుమ్మిడికుంట చెరువు కూడా కబ్జాకు గురైనట్టు తెలిసిపోయింది. చెరువును అనుకొని కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి కమిషనర్ రంగనాథ్ సిద్ధమయ్యారు. తుమ్మిడికుంట చెరువును అనుకొని ప్రముఖ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఈ ఫంక్షన్ హాల్ కట్టిన స్థలంలో కొంత భాగం చెరువుకు సంబంధించినదేనని కేసీఆర్ అప్పట్లోనే గుర్తించారు. కూల్చివేయాలని అప్పుడే ఆదేశించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూల్చివేత నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో హీరో నాగార్జునకు చెందినట్టు గా భావిస్తున్న ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కు ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితి నుంచి నటుడు నాగార్జున ఎలా బయట పడుతారో వేచిచూడాల్సిందే.