Home » Govt .Jobs : పరీక్ష లేకుండానే ఇంజనీర్ ఉద్యోగం. వేతనం రూ: 80 వేలు. పర్మినెంట్ జాబ్

Govt .Jobs : పరీక్ష లేకుండానే ఇంజనీర్ ఉద్యోగం. వేతనం రూ: 80 వేలు. పర్మినెంట్ జాబ్

Govt .Jobs : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ తాజాగా ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.oil-india.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ధరఖాస్తు గడువు ఆగస్టు 16. నోటిఫికేషన్. ఆయిల్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ద్వారా మొత్తం 7 ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. అందులో కెమిస్ట్ ఇంజనీర్ 2, డ్రిల్లింగ్ ఇంజనీర్- 2, జియాలజిస్ట్- 2, సివిల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ను ఆయిల్ ఇండియా సంస్థ భర్తీ చేయబోతున్నది.

కెమిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారు కెమిస్ట్రీలో రెండేళ్ల పీజీ కోర్సు చదివి ఉండాలి. లేదా కెమికల్, పెట్రోలియం, మెకానికల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీఈ, బీటెక్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. డ్రిల్లింగ్ ఇంజనీర్ ఉద్యోగాలకు, పెట్రోలియం, మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల అనుభవం తప్పనిసరి. జియాలజిస్ట్ ఇంజనీర్ పోస్టులకు అయితే జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. సివిల్ ఇంజనీరింగ్‌ ఉద్యోగాలకు, ఇదే విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ తో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ పోర్టల్ www.oil-india.com వెబ్ సైట్ ద్వారా దరఖాస్తును ఆన్లైన్ లో చేయాలి. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత సాధించాలంటే కనీసం 50 మార్కులు సాధించాలి . ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

ఆగస్టు 16న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ చిరునామా : మహానది బేసిన్ ప్రాజెక్ట్ (ఎరస్టివైల్ బే ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్ట్), ఆయిల్ ఇండియా లిమిటెడ్, IDCO టవర్స్, 3వ అంతస్తు, జనపథ్, భువనేశ్వర్-751022, ఒడిశా.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *