Only One Plant : మన ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అందులో ఏ మొక్క దేనికి పనిచేస్తుందో తెలియదు. ప్రతి మొక్క ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. కరివేపాకు మొక్కను కేవలం సాంబారు లో వేసుకుంటారు. కానీ ఆ ఆకుతో ఎంతో మేలు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఒకే ఒక మొక్క 150 రోగాలకు పనిచేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆ మొక్క మన ఇంటిలో ఉందా ? లేదా ? ఉంటె ఆ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన ఇళ్లల్లో రణపాల మొక్క పెరుగుతుంది. మొక్క ఆకుల నుంచే వేర్లు పుట్టి మొక్క తయారవుతుంది. ఆకు దళసరిగా ఉంటుంది. ఆకు రుచి వగరుగా, పులుపుగా ఉంటుంది. మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయోల్, యాంటీ ఫంగల్,యాంటీ హిస్టామైన్ తోపాటు అనాఫీలాక్టిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి.
రణపాల ఆకుతో పాటు రసం, కషాయం , ఆకును రుబ్బి గాయాలకు కట్టు కట్టినా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆకు తింటే కనీసం 150 రోగాలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.జీర్ణాశయంలో అల్సర్లు, అజీర్తి,మలబద్దకం సమస్యలు కూడా రణపాల ఆకుతో పరిస్కారం అవుతాయి.
రణపాల ఆకులు తింటే కిడ్నీ సమస్యలు కూడా రావు. కిడ్నీలో రాళ్లు ఉంటె కూడా కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూత్ర పిండాల పనితీరుకు కూడా ఉపయోగపడుతాయి.
కామెర్ల వ్యాధి సోకిన వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రణపాల ఆకు రసాన్ని రెండు చెంచెలు తాగితే వ్యాధి నయం అవుతుంది. బీపీ ఉన్నవారు రోజు మూడు ఆకులు తింటే హైబీపీ అదుపులో ఉంటుంది. మూత్రంలో మంట, చీము, రక్తం సమస్యలను కూడా ఈ ఆకు నివారిస్తుంది. విరేచనాలు, జలుబు, దగ్గు ను కూడా అదుపు చేస్తాయి.
రణపాల ఆకులను మెత్తగా రుబ్బి ముద్ద చేసి నుదిటిపై పెడితే తలనొప్పి నయమవుతుంది. వారానికి ఒకసారి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది. ఆకులను వేడి చేసి గాయాలపై పెడితే గాయాలు తొందరగా నయమవుతాయి. ఆకు పసరు రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.