Kalki Collecton Full : కల్కి సినిమా చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ సినిమా కోసం వాడిన సాంకేతిక నైపుణ్యం అద్భుతంగా ఉంది. సౌండ్ ఎఫెక్ట్ చెప్పలేని విదంగా ఉంది. సంగీతం వినడానికి కూడా ఎంతో ఇంపుగా ఉంది. ఫైట్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటన మరచిపోలేని విదంగా తీర్చిదిద్దారు.
కల్కి సినిమాను రు : 600 కోట్ల బడ్జెట్ తో నిర్మాత అశ్వినీదత్ నిర్మించాడు. ఇంత బడ్జెట్ తిరిగి వసూలు అవుతుందా అనే అనుమానాలను సినిమా బృందం కూడా కొంత వరకు అనుమానం వ్యక్తం చేసింది. కానీ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచే వసూళ్లలో మేటిగా నిలిచింది. విడుదల అయిన నాటి నుంచి నేటి వరకు రోజు, రోజుకు వసూళ్లు పెరిగిపోతున్నాయి. ఈ రోజు ఎంత వసూళ్లు అవుతాయనేది కూడా కచ్చితంగ చెప్పలేక పోతోంది తెలుగు సినీ పరిశ్రమ.
సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల గణాంకాల ప్రకారం బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి రూ.600 కోట్ల వసూళ్లు దాటిపోయిందని ప్రకటించారు. ఇండియాలో రూ.343.6 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లోనే రూ.182 కోట్లు, నార్త్ ఇండస్ట్రీలో రూ.128 కోట్లు, ఉత్తర అమెరికాలో 12 మిలియన్స్ డాలర్ల కలెక్షన్ చేసి అగ్రగామిగా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆరువందల కోట్ల రూపాయల కలెక్షన్ లు దాటి పోవడంతో సినిమా బృందం ఆనందంలో మునిగి పోయింది. మరి కొద్దీ రోజుల్లో రు: 1000 కోట్ల కలెక్షన్ దాటే అవకాశాలు కూడా ఉన్నాయని సినీ పరిశ్రమ అభిపాయ పడుతోంది.