Kalki Collection : ” కల్కి 2898 AD ” సినిమా విడుదలై రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పెద్ద పండుగలా అవతరించింది. తెలుగు, హింది పరిశ్రమతో పాటు విదేశాల్లో కూడా కల్కి సినిమాకు ప్రశంసలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కల్కి నటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక వర్గం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిస్పందన రావడంతో వారిలో ఆనందం వ్యక్తం అవుతోంది. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడంతో అభిమానుల్లో జోష్ నిండింది.
కల్కి సినిమా పెట్టుబడి రు: 600 కోట్లు గ ప్రకటించారు పెట్టుబడిదారులు. సినిమా నిర్మాతలు ఆశించిన దాని కంటే ఎక్కువే కలెక్షన్ లు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయనే అభిప్రాయాలూ సైతం చిత్ర పరిశ్రమలో వ్యక్తం అవుతున్నాయి. సినిమా విడుదలై మూడు రోజులు అవుతోంది. రెండు రోజుల్లో కల్కి రు: 300 కోట్ల వసూలుకు చేరడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనందం వ్యక్తం అవుతోంది.
సినిమా విడుదల అయిన మొదటి రోజు రు : 192 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా రు : 108 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు, నాలుగో రోజు సెలవు రోజులు కావడంతో వసూళ్ల పర్వం పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ ఇండస్ట్రీ వారు అభిప్రాయపడుతున్నారు. రు : 300 కోట్ల వసూలు చేసినట్టుగా సినిమా బృందం అధికారికంగా శనివారం ప్రకటించడం విశేషం.