AP KOOTAMI : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి భేదాభి ప్రాయాలు లేకుండా తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు జతకట్టాయి. అధికారం కోసం ఏర్పడిన కూటమి రాష్ట్రంలో బలపడింది. దీనితో వైసీపీ అభ్యర్థులకు నిద్రపట్టడంలేదు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఐకమత్యంతో వార్డ్ స్థాయి నుంచి పనిచేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ ఐదేళ్ల పరిపాలన తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం దక్కించుకోవడం తప్పదని ఈపాటికే పలు సర్వే లు స్పష్టం చేసాయి.
ప్రస్తుత సీఎం జగన్ పై ఉద్యోగులు అసంతృప్తి తో ఉన్నారు. సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని పేరు ఉంది. రావాల్సిన ప్రయోజనాలను మంజూరు చేయక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొన్న ఉద్యోగుల ఉత్సహం తీరు చేస్తే వైసీపీ కి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు తెలుస్తోంది. జగన్ సకాలంలో ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ కి సామాజిక వర్గాలు, వివిధ సంఘాలు బాహాటంగానే మద్దతు ఇచ్చాయి. తాజా ఎన్నికల్లో అవన్నీ కూడా జగన్ కు దూరమైనాయని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా అధికారంలోకి వస్తే ఏమిచేయబోతున్నామనది ప్రజలకు స్పష్టంగా చెబుతున్నారు. ప్రచారంకు జనం స్పందన విపరీతంగా ఉంది. స్పందన తీరు చూస్తే ఎక్కువ శాతం ప్రజలు మూడు పార్టీల అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారు. తాజా ఎన్నికల్లో వారంతా వైసీపీ అభ్యర్థులకు అండగా నిలబడటం లేదని తెలుస్తోంది. 2019 లో ఉన్న పట్టుదల నేటి ఎన్నికల సమయంలో కానరావడంలేదు. 2019 ఎన్నికలో టీడీపీ, జనసేన పార్టీలకు దూరమైన కర్షకులు, మేధావులు, విద్యావంతులు నేడు కూటమికి దగ్గరవుతున్నారు.
పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు, వివిధ రకాల పన్నుల భారం తో ప్రజలు సతమతమవుతున్నారు. పథకాల పేరుతో ఇవ్వడం, పన్నుల రూపంలో వసూలు చేయడం పై జనంలో విమర్శలు తలెత్తుతున్నాయి. అభివృద్ధి గురించి పట్టించుకున్న సందర్భాలు లేవని జనం బాహాటంగానే విమర్శిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడంలేదు.
జగన్ ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో అయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పాదయాత్రలు, ప్రచారం చేశారు. తాజా ఎన్నికల్లో షర్మిల దూరం అయ్యారు. ఆమె ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో జగన్ ను ఘాటుగానే విమర్శిస్తూ ప్రచారం చేయడం కూడా జగన్ ను కష్టకాలంలోకి నెట్టింది.