Laughing Budda : లాఫింగ్ బుద్దా .. ఆ బొమ్మను చూస్తేనే నవ్వొస్తోంది. ఆ బొమ్మ గురించి తెలియని వారు సాధారణంగా ఎవరూ ఉండరు. లాఫింగ్ బొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా బహుశా ఉండదు. చాలా మంది ఈ బొమ్మను ఇళ్లలో పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులందరు సుఖ,సంతోషాలతో ఉండాలని పెడతారు. మరికొందరు సిరిసంపదలు పెరగాలని కోరుకుంటారు. లాఫింగ్ బుద్ధాను కన్నార్పకుండా ఓ పదిహేను సెకన్లు చూస్తే చాలు, చూసేవారు కూడా నవ్వడం తప్పదు. మంచి జరగాలని కోరుకుంటూ సాధారణంగా బొమ్మను కొనుగోలు చేస్తారు. కానీ ఆ బొమ్మను ఏ దిక్కులో పెట్టాలి. ఇంటిలో పెట్టుకోవడం వలన పలు లాభాలు సైతం ఉన్నాయి. ఇంటిలోని ఏ గదిలో ఉంచాలి అనే నియమాలు మాత్రం చాలా మందికి తెలియదు. బొమ్మను అమ్మేవారు కూడా కొందరు చెప్పరు.
లాఫింగ్ విగ్రహాన్ని మనకు మనం సొంతగా కొనుక్కోరాదు. ఎవరైనా కొని ఇస్తే తీసుకోవాలి. అప్పుడే దాని ప్రతిఫలం ఉంటుంది. సరైన దిక్కులో ఉంచాలి. ఎక్కడ పడితే అక్కడ నిలిపితే వ్యతిరేక ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇంటిలోని తూర్పు దిక్కున విగ్రహాన్ని పెడితే కుటుంబ సభ్యల మధ్య గొడవలకు అవకాశం ఉండదు. ఇంటిలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది.
ఇంటిలో పడమర దిక్కులో బొమ్మను ఏర్పాటు చేస్తే వేధిస్తున్న సమస్యలు దూరమవుతాయి. ఆగ్నేయ దిశలో పెడితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. సంపద పెరుగుతుంది. భార్య పిల్లలంతా ఆరోగ్యముగా, ఆనందంగా గడుపుతారు. వంటగది, స్నానపు గది, మరుగుదొడ్డి గదుల్లో పెట్టరాదు. సాధ్యమైనంత ఎత్తులో, కంటికి మనిపించే విదంగా అందుబాటులో ఉండాలి.