Ethic : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీలో శనివారం హిందీ భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు హిందీ అక్షర రూపంలో చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయులు నిర్వహించిన హిందీ భాష పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ హింది భాషా ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ భాషా అయినటువంటి హింది ని నేర్చుకోవాల్సిన అవసరం తప్పనిసరన్నారు. హిందీ భాష పై పట్టు సాధించిన వారికి కూడా జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

by