CITU : రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన వారిని కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి భీమారం,జైపూర్ ప్రాంతాలలో తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. ప్రాణహిత, గోదావరి ఉధృతి మూలంగా పత్తి, వరి పంటలు పూర్తిగా నీటమునిగాయన్నారు. అదే విదంగా రవాణా వ్యవస్థ కూడా దెబ్బతినడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. పేరుకుపోయిన నీటి వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన ఈ ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. నష్టపోయిన పత్తి, వరి పంటలకు ఎకరాకు రూ: 50,000, మిగితా పంటలకు ఎకరానికి రూ: 30000 ఇవ్వాలని సిపిఎం పార్టీ తరపున రవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బోడెంకి చందు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సామల ఉమారాణి సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు, ఏరియా సీపీఎం నాయకులు నాగజ్యోతి, రేణుక రమాదేవి, సత్యం,పాయిరాల రాములు తదితరులు పాల్గొన్నారు

by