Sleeping : మన శరీరం ఎల్లవేళలా ఆరోగ్యముగా ఉండటానికి కేవలం ఆహారం, వ్యాయామం ఒక్కటే సరిపోదు. వాటితో పాటు నిద్ర కూడా అవసరమే. మంచి ఆహారం తీసుకొని, నిత్యం వ్యాయామం చేస్తున్న వారికి నిద్ర లేకపోతే వారి శరీరం అనారోగ్యం అవుతుంది. కాబట్టి ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసుకుందాం.
ప్రతి వ్యక్తికి నిద్ర ప్రాధాన్యం. వయసు ప్రకారం నిద్ర అవసరం. పొత్తిళ్లలో పెరిగే పిల్లలు రోజులో 14 గంటలు నిద్ర పోతారు. ఇది వయసు పెరుగుతున్న కొలది తగ్గుతుంది. పిల్లులు పెరుగుతున్న క్రమంలో వాళ్ళ నిద్ర సమయం కూడా తగ్గుతుంది.
యువకులు రోజులో పది నుంచి పన్నెండు గంటలు నిద్ర పోతారు. యుక్త వయసు నుంచి పెద్ద వయసు వ్యక్తులు రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. అప్పుడే వారు ఆరోగ్యముగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఏవయసు వారైనా సకాలంలో సరిపడేంత నిద్ర పోనిచో అనారోగ్యానికి గురికాక తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతూవుంటారు. నిద్ర లేకుంటే మెదడు, న్యూరాన్ల పరిస్థితి దెబ్బతింటుంది. సరిపడేంత నిద్రలేకుంటే బీపీ, షుగర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.