Meals : పేదలకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. అన్నదానంకు మించిన దానం మరొకటి లేదంటారు పెద్దలు. అన్నదానం చేయడంలో చాలా మంది ముందుంటారు. తిరుమల లో ప్రతిరోజూ కనీసం 40 వేల మందికి పైగా అన్న ప్రసాదం భక్తులకు అందుతుంది. ఈ విధంగా చాలా దేవస్థానాల్లో భక్తులకు అన్నప్రసాదం ఉంటుంది. కానీ తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిరోజూ అన్నదానం చేస్తున్న హీరో ఒకరు ఉన్నారు. ఏకంగా ప్రతిరోజూ 350 కి పైగా అన్నదానం చేస్తూ పేదల కడుపు నింపుతున్నాడు. ఇప్పుడు ఆ హీరో గురించి తెలుసుకుందాం…….
ఆ హీరో ఒకవైపు చిత్ర పరిశ్రమలో నటిస్తూనే, మరోవైపు హోటల్ వ్యాపారంలో ఉన్నారు. సినిమా పరిశ్రమకు రాక ముందు ఆ నటుడు హోటల్ వ్యాపారంలో నిలదొక్కుకున్నారు. ఆ హీరో కు మొత్తం ఏడు రెస్టారెంట్ హోటల్ ఉన్నవి. ఒక్కొక్క హోటల్ నుంచి ప్రతిరోజూ 50 మందికి సరిపడేంత భోజనం పేదలకు పంపుతాడు. ఇలా ఏడు హోటల్ నుంచి ప్రతిరోజూ 350 మందికి ఒకపూట భోజనం పంపిణీ చేస్తూ వారి కడుపు నింపుతున్నాడు. ఎక్కడైతే ఆకలితో అలమటించే వారు ఉంటారో అక్కడికి నేరుగా భోజనం వెళుతుంది.
ప్రతి రోజూ 350 మంది పేదల కడుపు నింపుతున్న ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్. ఆయన హీరోగా నటించిన సినిమా పేరు ” మజాకా “. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నటించింది. సాంకేతిక పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.