Home » Nirmalamma : నటి నిర్మలమ్మ అసలు పేరు, చివరి సినిమా తెలుసా ?

Nirmalamma : నటి నిర్మలమ్మ అసలు పేరు, చివరి సినిమా తెలుసా ?

Nirmalamma : తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటి నిర్మలమ్మ గురించి తెలియని వారు ఉండరు. ఆమెకు అభిమానులు కూడా దండిగానే ఉన్నారు. ఆమె నాటకాల స్థాయి నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె సొంత ఊరు ఏపీలోని మచిలీపట్నం. 1920, జులై 18న జన్మించింది. తల్లి,దండ్రులు గంగమ్మ, కోటమ్మ. మొట్టమొదటి సారిగా ఆమె హీరోయిన్ పాత్రలోనే నటించింది. అందుకు తగిన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ పాత్రల వైపు మొగ్గు చూపింది.

క్యారెక్టర్ నటిగా ఎన్టీఆర్ నుంచి మొదలుకొని చిరంజీవి వరకు నిర్మించిన స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించింది. బామ్మ పాత్రలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాకే పరిమితం కాకుండా తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. నిర్మలమ్మ 2009 ఫిబ్రవరి 19 న కన్నుమూశారు.ఆమె చిత్ర పరిశ్రమకు చెందిన కృష్ణారావు ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారికి పిల్లలు లేరు. దింతో ఒక అమ్మాయిని పెంచుకుంది. ఆ కూతురు పేరు కవిత. వారికి ఒక కొడుకు. కవిత అమెరికాలో స్థిరపడిపోయింది.

నిర్మలమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలోకి రాక ముందు అసలు పేరు రాజమణి. వయోభారంతో ఆమె సినిమాలకు దూరమయ్యారు. చిరంజీవి సినిమాలో చివరి సారిగా నటించింది. ఆ సినిమా పేరు ” స్నేహం కోసం ” ఆ సినిమా తరువాత నిర్మలమ్మ ఏ సినిమాలో కూడా నటించలేదు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *