THAMANNA : ప్రముఖ తెలుగు సినీ నటి తన అందాలతో ఇన్నేళ్ళుగా తన అభిమానులను అలరించింది. నటనతో అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. బాహుబలి లో ప్రభాస్ తో నటించి తిరుగులేని నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు సంపాదించింది. తెలుగులో రాణిస్తూనే మరోవైపు దక్షిణాది భాషల్లో సైతం తోటి నటించి మెప్పించి హీరోయిన్ లకు వరుసగా సవాల్ విసిరింది. ఇప్పుడు తమన్నా పూర్తిగా భక్తురాలిగా మారిపోయింది. శివ నామస్మరణం మినహా మరో దేవుని పేరు పలుకడం లేదు తమన్నా. ప్రస్తుతం తనకు శివుడే అన్ని. శివునికి మించిన వారు నా హృదయంలో ఎవరికీ చోటు లేదంటోంది తమన్నా. నా తపన అంత కూడా శివుడే అంటోంది తమన్నా. తమన్నా అని ఎవరైనా పిలుస్తే శివ అని ఎదురు పిలుపు వస్తోంది తమన్నా నోటి నుంచి. తమన్నా శివనామస్మరణ విన్న వారంతా కూడా చేసి ఏమిలేక వారంతా కూడా శివ,శివ అంటూ శివనామస్మరణమే చేస్తున్నారు.
తమన్నా ఇంకా ఏమంటోందంటే….ప్రతియుగంలో ప్రజలను రక్షించుకోడానికి దేవుడు అందరికి అందుబాటులో ఉన్నాడు. ప్రజలను రక్షిస్తూ, చెడును పారదోలేది ఒక్క శివునీకె సాధ్యమవుతోంది అని స్పష్టం చేస్తోంది. శివుని అనుమతి లేనిదే చీమ అయినా కుట్టదు. అందుకే నేను శివుని సన్నిధిలో ఉండి పూజలు చేస్తున్న అంటోంది తమన్నా ” ఓదెల 2 ” సినిమాలో. మధు క్రియేషన్స్ లో సంపత్ నంది చిత్ర బృందం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వం చేపట్టారు. ఓదెల రైల్వే స్టేషన్ ఫేమ్ ఫేమ్ అశోక్ తేజ ఓదెల -2 సినిమాను కూడా చేప్పట్టడం విశేషం. మొదటి షెడ్యూల్ ను సినీ సాంకేతిక వర్గం విజయవంతంగా పూర్తి చేసింది.
పరమ శివుని పవిత్ర నివాసమైన వారణాసి లో మార్చి నెలలో సినిమా రెండో భాగం షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఓదెల-2 సినిమాలో తమన్నాతో పటు హెబ్బా పటేల్, మురళి శర్మ,శ్రీకాంత్ అయ్యంగార్,వశిష్ఠ , ఎం సింహ కలిసి నటిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఓదెల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నిర్మిస్తున్న ఓదెల-2 సినిమా ను అభిమానులు కోరిక మేరకు అతి తొందరలోనే విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-