Home » బెల్లంపల్లిలో CPI రాస్తారోకో

బెల్లంపల్లిలో CPI రాస్తారోకో

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన
కోల్ బెల్ట్ న్యూస్, బెల్లంపల్లి:

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు మరియు పెట్రోల్–డీజిల్ కొరతకు నిరసనగా ఈరోజు బెల్లంపల్లిలోని కాంట చౌరస్తా వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మరియు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా పంట కోతల సమయంలో డీజిల్ లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చేశారు.

ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులే ఒక తార్కాణమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ. 993 పెంచి రూ. 3100కు పెంచిండంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా, డీజిల్ మరియు పెట్రోల్ పై లీటరుకు రూ. 5/- మరియు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పై రూ. 50/- పెంపు ప్రతిపాదనలు ఆయిల్ కంపెనీలు పంపినట్లు పేర్కొన్నారు.అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగినా, దేశంలో నిల్వలు ఉన్నాయని చెప్పే కేంద్ర ప్రభుత్వం ధరలను ఎందుకు పెంచుతోందని ప్రశ్నించారు.గ్యాస్ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఆహార వ్యాపారాలు ప్రభావితమవుతున్నాయని, పెట్రోల్–డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుందని హెచ్చరించారు.

ప్రధాన డిమాండ్లు:
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, డీజిల్ కొరతను నివారించాలి, ఆయిల్ కంపెనీల ధరల పెంపు ప్రతిపాదనలు ఆమోదించవద్దు

ఈ కార్యక్రమంలో బొల్లం తిలక్ అంబేద్కర్, బొంతల లక్ష్మీనారాయణ, డిఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, రత్నం రాజం, మేకల రాజేశం, జూపాక కొమురయ్య, బొంతల కళారాణి, కాస్పేట స్వర్ణలత, బొంకూర్ రామచందర్, ఉప్పుల శంకర్, కే తిరుపతి, ఆంధ్రుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *