దేవాపూర్ ఎన్నికల్లో పైచేయి సాధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్.
ఎమ్మెల్యే సోదరుడిదే విజయం
దేవాపూర్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడిగా కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం
ఎమ్మెల్యే వినోద్ కు ఛాలెంజ్ కానున్న రాబోయే స్థానిక ఎన్నికలు .
Devapoor : మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ కంపెనీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం సాధించారు. నిండా మూడు వందల ఓట్లు లేవు. కానీ ఎమ్మెల్యే ఎన్నికలను మరిపించాయి. ఎందుకంటే ఎమ్మెల్యేల అనుచరులే బరిలో ఉన్నారు. ఒకవైపు ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, మరొకొరికి మరో ఎమ్మెల్యే అండగా నిలిచారు. దింతో ఎమ్మెల్యే ఎన్నికలను మరిపించాయి.
హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సోదరుడు కొక్కిరాల సత్యపాల్ రావ్141 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి విక్రమ్ రావ్ కు 108 ఓట్లు పోలైనాయి. బెల్లంపల్లి, చెన్నూర్, ఉట్నూర్ ఎమ్మెల్యేలు పుస్కూరి విక్రమ్ రావ్ కు మద్దతు పలికారు. మంత్రి సహా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా, సునాయాస విజయం సాధిస్తామనుకున్న అభ్యర్థి ఆశలు అడియాసలయ్యాయి. ముగ్గురు ఒక్కటై , ఓటమి పాలు కావడంతో మంచిర్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నిక పెద్ద చర్చనీయాంశం అయ్యింది. గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడే కావచ్చు. కానీ ఇక్కడ వర్గపోరు పై ఈ ఎన్నిక ప్రభావం చూపుతోంది.
ఇది ఇలా ఉండగా దేవాపూర్ కంపెనీ కాసిపేట మండల పరిధిలోనిది. ఈ మండలం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు సొంత మండలం. మరోవైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గంలోని మండలం కాసిపేట. తన నియోజకవర్గంలోని కార్మిక ఎన్నికల్లో పరాజయం పొందడం ఆయనకు గట్టి ఎదురు దెబ్బనే. అంతే కాదు ఈ పరాజయం రాబోయే స్థానిక ఎన్నికలకు సవాలుగా వినోద్ కు నిలిచింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కి కూడా ఈ ఎన్నిక ఎదురుదెబ్బనే. విజయం సాధించి ప్రత్యర్థి వర్గంపై పై చేయి సాధించాలని కన్న కళలు సోదరులకు నెరవేరలేదు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ సొంత మండలం కాసిపేట. ఒకవైపు సొంత మండలం. మరోవైపు రక్త సంబంధం. అందుకే ఆయన గట్టి పట్టుదలతో సోదరుడి విజయాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. గెలుపు కోసం ఆర్థిక మూలాలు ఇక్కడ ప్రధాన అంశం కాదు. ఆర్థిక బలం, అంగ బలం ప్రేమ్ సాగర్ రావ్ కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ సోదరుడి విజయాన్ని ఆయన సునాయాసంగా ముద్దాడటం విశేషం.

by